TTA Holi Celebrations: ఎక్కడ ఉన్నా.. మన సంస్కృతి.. మన పండుగలను మర్చిపోలేం. దేశం కాని దేశంలో అందరికీ దూరంగా ఉన్నా మన ఉత్సవాలను జరుపుకోవడం విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్. డల్లాస్ లో తెలుగు ప్రజల కోసం ఎప్పుడూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ.. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలను ఎప్పటికప్పుడు ఒక చోటకు చేర్చి ఉత్సాహ పరుస్తున్న తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ఇప్పుడు మరో ఉత్సవానికి రెడీ అయిపోతోంది.
రంగుల కేళి.. హొళీ పండుగను ఉల్లాసంగా నిర్వహించడానికి బిగ్గెస్ట్ హోళీ మేళా (Biggest Holi Mela) ఏర్పాటు చేసింది తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్. డల్లాస్ లో 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రంగుల పండుగను నిర్వహించబోతున్నారు. 9134FM2931, Pilot Point, TX 76258 వేదికగా నిర్వహించే ఈ కలర్ఫుల్ ప్రోగ్రామ్ లో అందరినీ ఉత్తేజపరిచే పలు ఈవెంట్స్ ఉంటాయని TTA తెలిపింది.
ఇది కూడా చదవండి: Narendra Modi: ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం ప్రదానం
హొళీ అంటేనే రంగుల ఉత్సవం కదా.. రంగులు వెదజల్లుకునే సరదాతో పాటుగా.. డీజే దర్శ్.. ఘర్షణ బ్యాండ్ హంగామా ఉంటుంది. దీనికి అనుగుణంగా అందరూ కలిసి చేసే డ్యాన్స్ సందడి ఉంటుంది. పిల్లల కోసం ప్రత్యేక ఆటల వేడుక మరి ఇవన్నీ ఉన్నాకా డ్రింక్స్.. ఫుడ్ ఎనర్జీ కూడా కావాలి కదా. వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలోకి ఎంట్రీ పూర్తిగా ఉచితం అని నిర్వాహకులు తెలిపారు.
ఈ రంగుల కార్యక్రమానికి మహాన్యూస్ యూఎస్ఏ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది. మరిన్ని వివరాల కోసం +1(704) 421-3855, +1(203) 551-0926 నంబర్లలో సంప్రదించవచ్చు.

