Trump: అమెరికా రాజకీయాల్లో మరోసారి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్‌ను నియమించిన సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఓవల్ ఆఫీస్‌లో అధికారిక కార్యక్రమం జరుగుతున్న సమయంలో చేయడం మరింత దుమారం రేపింది.
మాదకద్రవ్య వ్యసనాన్ని నియంత్రించే ఉద్దేశంతో జారీ చేసిన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన డగ్ బర్గమ్, ఆయన భార్య కేథరిన్ గురించి ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బర్గమ్ దంపతులు గుర్రాలపై స్వారీ చేస్తున్న ఒక వీడియోను తాను చూశానని, అందులో కేథరిన్ చాలా అందంగా కనిపించారని ట్రంప్ అన్నారు. ఆ వీడియో తనను బాగా ఆకట్టుకుందని, ఆమె ఆకర్షణే డగ్ బర్గమ్‌కు పదవి ఇవ్వడానికి ఒక కారణమైందని వ్యాఖ్యానించారు.
ఈ మాటలు వినిపించిన సమయంలో డగ్ బర్గమ్, ఆయన భార్య కేథరిన్ ఇద్దరూ ట్రంప్ వెనుకే నిలబడి ఉండటం గమనార్హం. ట్రంప్ తన వ్యాఖ్యల్లో బర్గమ్‌ను విజయవంతమైన వ్యాపారవేత్తగా, నార్త్ డకోటా రాష్ట్రానికి రెండుసార్లు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడిగా ప్రశంసించారు. అయితే, ఆయన విజయాల వెనుక కేథరిన్ కీలక పాత్ర పోషించి ఉండొచ్చని కూడా చెప్పారు. వారిద్దరూ అద్భుతమైన జంట అని వ్యాఖ్యానించారు.
Also Read: Lara: గంభీర్ నిర్ణయాలు భారత క్రికెట్ కు ప్రమాదకరం
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఒక మహిళ అందాన్ని కారణంగా చూపుతూ పదవుల నియామకం గురించి మాట్లాడటం సరైంది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఫెమినిస్టు సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. మహిళలను వస్తువుల్లా చూడటం, వారి రూపాన్ని ఆధారంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం అధ్యక్ష పదవికి తగినది కాదని విమర్శించారు.
కేథరిన్ కూడా గతంలో డ్రగ్ అడిక్షన్ సమస్య నుంచి బయటపడ్డ వ్యక్తి కావడంతో, ఆ అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అలాంటి సందర్భంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత అసౌకర్యాన్ని కలిగించాయని పలువురు అంటున్నారు. గతంలోనూ ట్రంప్ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
BREAKING: Trump just claimed that he hired Doug Burgum because he was attracted to his wife. What an awkward moment.
“I saw them riding horses in a video. And I said, ‘Who is that?’ I was talking about her, not him. I said, ‘I’m gonna hire her,’ because anybody that has… pic.twitter.com/BE7BqEql0T
— Brian Krassenstein (@krassenstein) January 29, 2026
