Donald Trump: కెనడాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి తీవ్రతను గమనించి, అర్ధాంతరంగా సమావేశం నుంచి నిష్క్రమించి, అమెరికాకు తిరిగి బయలుదేరారు. వైట్‌హౌస్ ప్రకారం, ట్రంప్ వచ్చీరాగానే భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక ఆదేశాలు, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
జీ7లో కీలక చర్చలు – స్టార్మర్‌తో ఒప్పందం
ట్రంప్ జీ7 సదస్సులో యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, ఇరాన్ అణు ఒప్పందం అంశాలపై దృష్టి సారించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ స్పందిస్తూ ట్రంప్ తిరుగు ప్రయాణం సరిఅయిన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. జీ7 దేశాల నేతలంతా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న హింసను విరమించాలంటూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal: గుజరాత్‌ను బీజేపీ 50 ఏళ్లు వెనక్కి నెట్టింది.. కేజ్రీవాల్ వ్యాఖ్యలు
ఇరాన్‌పై ట్రంప్ హెచ్చరికలు – టెహ్రాన్ ఖాళీ చేయాలన్న ఆదేశం
అమెరికా తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. ట్రంప్ టెహ్రాన్ ప్రజలకు తక్షణమే నగరం ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఇరాన్‌కు ఇంకా ఆలస్యం కాకముందే అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ఇప్పటికైనా శాంతికి మార్గం ఉందని, కానీ సమయం బహు తక్కువగా మిగిలిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
తొంగ దృష్టిలో యుద్ధం – ప్రపంచం అంతా టెన్షన్‌లో
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఈ ఉద్రిక్తతలు మానవాళికి పెను ముప్పుగా మారే ప్రమాదం ఉంది. ఒకవైపు యుద్ధ భయాందోళనలు, మరోవైపు శాంతి యత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకునే నిర్ణయాలు, జీ7 దేశాల ఉమ్మడి ప్రకటనలు ప్రస్తుత పరిస్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.