Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్‌తో అమెరికాకు ఉండే అవసరం చాలా తక్కువగా ఉంటుందని, కానీ భారత్‌కు మాత్రం అమెరికాపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా అమెరికాను పెద్ద కస్టమర్‌గా భావించి చాలాకాలంగా అధిక మొత్తంలో వస్తువులను విక్రయిస్తోందని, కానీ ప్రతిగా అమెరికాకు భారత్‌లో వ్యాపారం చేసుకునే అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
అలాగే భారత్ అమెరికన్ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో అమెరికన్ కంపెనీల ఉత్పత్తులు భారత మార్కెట్‌లో పెద్దగా చోటు దక్కించుకోలేకపోతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

