Delhi Ganesh

Delhi Ganesh: సీనియర్ నటుడు ఢిల్లీ గణేశ్‌ కు నివాళి!

Delhi Ganesh: బాలచందర్ పరిచయం చేసిన గొప్ప నటుల్లో ఢిల్లీ గణేశ్‌ కూడా ఒకరు. సినిమాల్లోకి రాకముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన గణేశ్‌… ఢిల్లీలోనూ కొంతకాలంగా నాటక రంగానికి సేవ చేశారు. ఆ తర్వాత సినిమా నటుడిగా కెరీర్ ప్రారంభించారు. అందుకే ఆయన పేరు ముందు ‘ఢిల్లీ’ని పెట్టేశారు బాలచందర్.  వివిధ భాషల్లో దాదాపు 400 చిత్రాలలో నటించిన ఢిల్లీ గణేశ్‌ కమల్ హాసన్ సినిమాలలో భిన్నమైన పాత్రలు చేశారు. చివరగా కమల్ మూవీ ‘భారతీయుడు -2’లో ఆయన నటించారు. శనివారం అర్థరాత్రి కన్ను మూసిన ఢిల్లీ గణేశ్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: నేను మంచివాడిగా మారాను..జగన్ జోలికి నేను వేళ్లను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *