Treatning Mail: భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఈమెయిల్ రావడం తీవ్ర కలకలానికి దారితీసింది. ఈమెయిల్‌లో షమీని చంపేస్తామని హెచ్చరించడంతో పాటు రూ.1 కోటి డిమాండ్ చేశారు. షమీ తరఫున అతని సోదరుడు హసీబ్ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక దర్యాప్తులో “రాజ్‌పుత్ సిందార్” అనే పేరుతో ఉన్న ఈమెయిల్ ఐడీ నుంచి బెదిరింపు వచ్చినట్లు గుర్తించారు. నిందితుల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. ఇటీవల గౌతమ్ గంభీర్‌కు కూడా ఇలాంటి బెదిరింపులు రావడం, ఇప్పుడు షమీ లక్ష్యంగా మారడం చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం షమీ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున పోటీల్లో పాల్గొంటున్నారు.