YS Jagan: వైసీపీ అధినేత జగన్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. AP 40 DH 2349 కారు ఫిట్‌నెస్‌ను ఎంవీఐ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ప్రస్తుతం ఆ వాహనాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు.
జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్‌రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు.