Sangareddy

Sangareddy: నెల రోజుల్లో పెళ్లి… యువకుడు మృతి

Sangareddy: ఆ అబ్బాయి కి పెళ్లి ఫిక్స్ అయింది. కొన్ని రోజుల్లో పెళ్లి. అంతా బాగానే ఉంది. పెళ్లి కోసం ..ఆ పనుల్లో ఆ యువకుడు. అలా ఇంటి నుంచి వెళ్లి…శవమై కనిపించదు. చెరువు పక్కన మృతదేహం. చెరువులో డెడ్ బాడీ. చంపారా ? లేక ప్రమాదమా ? ప్రమాదం ఎలా నుకోవాలి ? నిత్యం వెళ్లే ఆ దారిలో వాహనం నడపడం బాగానే తెలుసు ? సో..ఇలా ఎన్నో అనుమానాలు …

సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. నెల రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ యువకుడు నదిలో పడి మరణించాడు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆ యువకుడి మృతదేహం న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మంజీరా నదిలో లభ్యమైంది.

హత్నూరు పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నాగలిగిద్ద మండలంలోని కరస్ గుత్తి గ్రామ సమీపంలోని గంగారం తండాకు చెందిన చౌహాన్ సునీల్ అనే యువకుడు కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. రామంతాపూర్‌లో పానీపూరీ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల సునీల్‌ పచ్చకామెర్ల వ్యాధికి గురయ్యాడు. దీంతో వ్యాధిని తగ్గించుకునేందుకు పిట్లంలో ఆయుర్వేద మందును తీసుకునేందుకు ఫిబ్రవరి 28న రామంతపూర్‌ నుంచి గంగారాం తండాకు పల్సర్‌ బైక్‌పై బయల్దేరాడు.

Also Read: Hyderabad: మలక్‌పేటలో శిరీష అనే మహిళ అనుమానాస్పద మృతి

స్వగ్రామానికి బయల్దేరిన సమయంలో రెండుమూడు సార్లు కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడాడు. కానీ ఇంటికి మాత్రం చేరుకోలేదు. దీంతో కంగారు పడిపోయిన కుటుంబసభ్యులు సునీల్‌కు కాల్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో ఏమైపోయాడోనని కుటుంబసభ్యులు కంగారుపడిపోయారు. హద్నూర్‌ పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా రాఘవపూర్‌ సమీపంలోని మంజీరా నది వద్ద రోడ్డు పక్కన పల్సర్‌ బైక్‌ కనిపించింది. ఆన్‌లైన్‌లో బైక్‌ నంబర్‌ను పరిశీలించగా.. కరస్‌గుత్తి గంగారం తండాకు చెందిన సునీల్‌గా తేలింది.

దీంతో పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న కుటుంబసభ్యులు.. బైక్‌ను పరిశీలించి అది తమ కుమారుడిదేనని గుర్తుపట్టారు. అంతలోనే మృతి చెందాడని గుండెలవిసేలా రోదించారు. సునీల్‌ మృతిపై అతని కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరో హత్య చేసి నదిలో పడేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *