Crime News: నువ్వు నాకు ఇష్టం..నీ ఇష్టం నాకు అనవసరం. మొత్తానికైతే మన ఇద్దరి ఇష్టం ..వేరు వేరు అయినా …నా దిల్ మొత్తం నువ్వే నా ప్యారి. ఇలాంటి మాటలే ..ఈ మాటలకు నవ్వాలి..బైక్ ఎక్కాలి..పిలిచినా చోటికి రావాలి. రాకుంటే …రాళ్లతో కొట్టం…లేకపోతె పెట్రోల్ పోయడం. చంపేస్తా ..లేదా చనిపోతా. ఇదే ఇప్పటి లవ్. ఈ లవ్ కు అమ్మాయిలు చనిపోతున్నారు. ఎందుకురా ఇలా తయారు అయ్యారు. ఏంటి అంత గొప్ప ప్రేమైతే …అండమాన్ అడవుల్లో ఉన్నా …నీ ప్రేమ నీ వద్దకు వస్తుంది. అది గుర్తు పెట్టుకో…
ఏపీలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటన సంచలనం సృష్టించింది. నంద్యాల జిల్లా, నందికొట్కూరు బైరెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. జీవితంపై ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుంటున్న ఇంటర్ బాలికపై ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు.
Crime News: ఇంటర్ చదువుతున్న విద్యార్థిని లహరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్ర అనే యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రేమించలేదని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. విద్యార్థి లహరి మంటల్లో కాలి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ప్రేమోన్మాది కూడా వంటికి నిప్పటించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా యువతులపై దాడులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చి.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎలాంటి మార్పు రావడం లేదు. యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాగా కడప జిల్లా, బద్వేలు, గోపవరంలో అక్టోబర్ 20న దారుణం జరిగింది. జీవితంపై ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుంటున్న ఇంటర్ బాలికపై స్నేహితుడి ముసుగులో ఉన్న వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కలవడానికి రమ్మని చెప్పి… పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
Crime News: నిందితుణ్ని వెంటనే అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పోలీసులు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. వారు తీవ్రంగా గాలిస్తుండగా రాత్రి వేళ ఓ బృందానికి నిందితుడు కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. బాలిక ప్రస్తుతం 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. ఆమె నుంచి జిల్లా జడ్జి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే సుధ పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.