Traffic Rules:

Traffic Rules: గ‌ణేశ్ నిమ‌జ్జ‌న సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 6న హైద‌రాబాద్ ట్రాఫిక్ ఆంక్షాలు ఇవే..

Traffic Rules: వినాయ‌క నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో సెప్టెంబ‌ర్ 6న పెద్ద ఎత్తున సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొననున్న‌ది. ఈ సంద‌ర్భంగా గ‌ణేశ్ శోభాయాత్ర వాడ‌వాడ‌ల నుంచి కొన‌సాగ‌నున్న‌ది. శివారు కాల‌నీ నుంచి కూడా ట్యాంక్‌బండ్ వైపు దారులు ప‌డతాయి. భ‌క్తుల నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు, బ్యాండ్ మేళాల చ‌ప్పుళ్లు, డీజే సౌండ్‌తో కోలాహ‌లం నెల‌కొంటుంది.

Traffic Rules: అందుకే గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం రోజున రోడ్ల‌న్నీ భ‌క్తుల‌తో నిండిపోతాయి. బాలాపూర్ వినాయ‌కుడు చార్మినార్‌, ఆబిడ్స్‌, లిబ‌ర్టీ, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ వ‌ర‌కు చేరుకుంటాడు. అందుకే అధికారులు హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌ల‌ను విధించారు. సికింద్రాబాద్ నుంచి వ‌చ్చే విగ్ర‌హాలు ప్యాట్నీ, ప్యార‌డైజ్, రాణిగంజ్‌, క‌ర్బ‌లా మైదాన్ నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటాయి.

Traffic Rules: టోలీచౌకీ, మెహిదీప‌ట్నం నుంచి వ‌చ్చే వినాయ‌క విగ్ర‌హాలు ఖైర‌తాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్‌కు చేరుకుంటాయి. ట‌ప్పాచ‌బుత్ర‌, ఆసిఫ్‌న‌గ‌ర్ నుంచి వ‌చ్చే విగ్ర‌హాల‌కు ఎంజే మార్కెట్‌లోకి మాత్ర‌మే అనుమ‌తిస్తారు. ఈ ప్ర‌ధాన రూట్ల‌లో వాహ‌నాల‌కు అనుమ‌తి లేదు.

Traffic Rules: సౌత్ ఈస్ట్ జోన్‌లోని కేశ‌వ‌గిరి, చాంద్రాయ‌ణ‌గుట్ట‌, మూసారాంబాగ్‌, చంచ‌ల్‌గూడ ప్రాంతాల నుంచి వ‌చ్చే వాహ‌నాలను దారి మ‌ళ్లిస్తారు. ప్యాట్నీ, ప్యార‌డైజ్‌, రాణిగంజ్ ప్రాంతాల‌లోనూ ట్రాఫిక్‌ను మ‌ళ్లిస్తారు. నిమ‌జ్జ‌నానికి ట్యాంక్‌బండ్ వైపు వ‌చ్చే వాహ‌నాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, క‌ట్ట‌మైస‌మ్మ ఆల‌యం, ప‌బ్లిక్ గార్డెన్స్‌, బుద్ధ భ‌వ‌న్ వెనుక‌, ఆద‌ర్శ‌న‌గ‌ర్‌, బీఆర్కే భ‌వ‌న్‌, ఖైర‌తాబాద్ ఎంఎంటీఎస్ స్టేష‌న్ వ‌ద్ద పార్కింగ్ ప్ర‌దేశాల‌ను ఏర్పాటు చేశారు.

Traffic Rules: ర‌ద్దీ స‌మ‌యంలో మెహిదీప‌ట్నం, కూక‌ట్‌ప‌ల్లి, సికింద్రాబాద్‌, ఉప్ప‌ల్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్, నారాయ‌ణ‌గూడ వ‌ర‌కు మాత్ర‌మే ఆర్టీసీ బ‌స్సుల‌కు అనుమ‌తి ఇస్తారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, ఔట‌ర్ రింగ్‌రోడ్ ద్వారా చేరుకోవాలి. సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌కు వెళ్లేవారు బేగంపేట‌, ప్యార‌డైజ్ రోడ్డును ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *