Traffic Rules:

Traffic Rules: 2025లో వాహ‌న‌దారుల‌కు భారీ షాక్‌! ట్రాఫిక్ చ‌లాన్లు డ‌బుల్‌!

Traffic Rules: హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో మీరు వాహ‌నం న‌డుపుతున్నారా? ట్రాఫిక్ పోలీసుల కండ్లుగ‌ప్పి వెళ్లాం.. అని భావిస్తున్నారా? చాటుగా మాటేసి క్లిక్‌మ‌నిపించి జ‌రిమానా వేస్తున్నారు తెలుసా? ఈ చ‌లాన్ యాప్‌లో మీ వాహ‌నం నంబ‌ర్ కొడితే మీకు ప‌డిన జ‌రిమానా తెలుస్తుంది. ఇలా ఈ ఏడాది ఇబ్బ‌డి ముబ్బ‌డిగా జ‌రిమానాలు ప‌డ్డాయ‌ని ప‌లువురు వాహ‌న‌దారులు ల‌బోదిబోమంటున్నారు. మ‌రి సైబ‌రాబాద్ పోలీసులా? మ‌జాకా? ఏమ‌నుకుంటున్నారు. నిరుటి కంటే ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో చ‌లాన్లు ప‌డ‌టం అంటే అదే మ‌రి. దీన్నిబ‌ట్టి 2025లో వాహ‌న‌దారుల‌కు భారీ షాక్ త‌గిలింద‌ని చెప్పుకోవ‌చ్చు.

Traffic Rules: 2025లో ఇప్ప‌టి వ‌ర‌కూ ట్రాఫిక్ చ‌లాన్లు రికార్డు స్థాయిలో న‌మోద‌య్యాయి. ఒక్క‌ సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోనే రెండింత‌లైన ఆ చ‌లాన్ల విలువ రూ.239 కోట్లుగా పోలీస్ అధికారులే తాజాగా వెల్ల‌డించారు. ఈ ఏడాది వాహ‌నాల‌ను ఆపి ట్రాఫిక్ పోలీసులు విధించిన చ‌లాన్లు 10,27,335 ఉండ‌గా, ఈచ‌లాన్లు 25,93,152 ఉన్నాయి. ఈ రెండుర‌కాల చ‌లాన్లు సుమారు 36 ల‌క్ష‌ల‌కు పైగా వాహ‌నాల‌పై విధించారు. వాటి మొత్తం విలువ రూ.239.37 కోట్లుగా పోలీసులు వెల్ల‌డించారు. అదే గ‌తేడాది ఈ చ‌లాన్ల విలువ రూ.111.81 కోట్లుగా ఉన్నాయి.

Traffic Rules: ఇదిలా ఉండ‌గా ట్రాఫిక్ నియంత్ర‌ణ‌లో పోలీసుల కొర‌త వేధిస్తున్న‌దని తెలుస్తున్న‌ది. సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో స‌రిప‌డా ట్రాఫిక్ సిబ్బంది లేరు. ఈ నేప‌థ్యంలో ప్రైవేటు వ్య‌క్తుల‌ను ట్రాఫిక్ మార్ష‌ల్స్‌గా ఎంపిక చేసి వారితోనే విధులు నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేర‌కు 2024లో 95 మంది ట్రాఫిక్ మార్ష‌ల్స్‌ను తీసుకోగా, 2025లో 172 మందిని ఎంపిక చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *