Tollywood: ఇండియన్ చిత్రాలకు విదేశాల్లో ఆదరణ పెరుగుతూ వస్తోంది. ప్రత్యేకించి అమెరికాలో భారతీయ చిత్రాలు అందునా తెలుగు చిత్రాల మార్కెట్ బారీ స్థాయిలో పెరిగింది. దానికి కారణం ఏమిటన్నది పక్కనపెడితే ఇటీవల కాలంలో దీనిని దృష్టిలో పెట్టుకుని మన స్టార్స్ అమెరికాలోనే తమ సినిమాల ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ తన తాజా చిత్రం ‘దేవర’ సినిమా యుఎస్ లో ప్రమోట్ చేయటమే కాదు ఆ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కి కూడా హజరయ్యాడు. ఇప్పుడు రామ్ చరణ వంతు వచ్చింది. చెర్రీ తన ‘గేమ్ ఛేంజర్’ టీజర్ లాంఛ్ తర్వాత యు.ఎస్ ప్రచారాన్ని డల్లాస్ లో ఈవెంట్ ద్వారా మొదలు పెడతాడట.
ఇది కూడా చదవండి: Appudo Ippudo Eppudo: తక్కువ నిడివితోనే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
Tollywood: దీనికోసం 21న అమెరికా వెళ్ళనున్నారు చరణ్. అమెరికాలోనూ భారీ ప్యాన్ బేస్ ఉన్న చరణ్ ప్రచారం సినిమాకు మరింత హైప్ తెస్తుందంటున్నారు. ఎన్టీఆర్ ప్రచారంతో ‘దేవర’ రీలీజ్ రోజుకి 3 మిలియన్ మార్క్ వసూళ్ళను దాటింది. ఇప్పుడు చరణ్ సైతం అదే ఫీట్ రిపీట్ చేస్తాడని నమ్ముతున్నారు. చరణ్ తో పాటు డైరెక్టర్ శంకర్ కి కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉండటం, కియారా అద్వానీ హీరోయిన్ కావటం కలసి వచ్చే అంశాలు. మరి అమెరికాలో చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తొలి రోజుకి ఏ స్థాయి వసూళ్లను నమోదు చేస్తుందో చూద్దాం.

