ఎవరీ జానీ మాస్టర్ … బ్యాక్ గ్రౌండ్ ఎంటీ?

జానీ మాస్టర్..తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ స్టార్ కొరియోగ్రాఫర్ గురించి జోరుగా చర్చ విపరీతంతగా నడుస్తోంది. గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసే శ్రేష్ఠ వర్మ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బాధితురాలు మైనర్ కావడంతో జానీ మాస్టర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి గోవాలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఇంతకీ ఎవరీ జానీ మాస్టర్ అతని బ్యాక్ గ్రౌండ్ గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.

జానీ మాస్టర్ అసలు పేరు షేక్ జానీ బాషా.. 1982 జూలై 2న ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరులో జన్మించారు. చిన్నప్పటి నుంచి జానీ మాస్టర్ కు డాన్స్ ఇష్టం ఉండటంతో ఎప్పటికైనా ఇండస్ట్రీలో మంచి కొరియోగ్రాఫర్ కావాలనుకునేవాడు. ముందుగా రియాలిటీ షో ఢీలో డాన్సర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఆక్కడ ఫేమ్ రావడంతో ఆయనకు సినిమాల్లో అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి. 2009లో నితిన్, ప్రియమణి జంటగా నటించిన ద్రోణ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు జానీ. రామ్ చరణ్ రచ్చ సినిమాతో జానీ మాస్టర్ కు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ తరువాత స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, రవితేజ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు.

భిన్నమైన స్టెప్స్‌తో జానీ మాస్టర్ షార్ట్ టైమ్ లోనే ఫేమస్ అయ్యాడు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ జిగేలు రాణి, మారి 2 నుంచి సాయి పల్లవి, ధనుష్ నటించిన ఫేమస్ రౌడీ బేబీ, అల్లు అర్జున్ అల వైకుంఠపురం సినిమాలో బుట్ట బొమ్మ, సల్మాన్ రాధే నుంచి సీత మార్ వరకు జానీ తన మార్క్‌ను చూపించాడు. దీంతో తెలుగులోనే కాకుండా బాలీవుడ్ సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేసే స్థాయికి ఎదిగాడు. జానీమాస్టర్ క్లాసికల్ డ్యాన్సర్ అయిన అయేషాను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇక ధనుష్, రాశీ ఖన్నా నటించిన ‘మెగామ్ కరుకత’ చిత్రానికి ఉత్తమ కొరియోగ్రఫీగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు జానీ మాస్టర్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: మహా విజయం.. డీ గ్యాంగ్ గుట్టు రట్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *