Telangana: ములుగు జిల్లా చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు. ఈ విషయాని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు.దింతో ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఏటూరునాగారంలోని ఆదివాసీ గూడాలు, అడవుల్లో కుంబింగ్ ముమ్మరం చేశారు. సివిల్, CRPF బలగాలు ఆధ్వర్యంలో పలు లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెంచారు. చతిస్గడ్ తెలంగాణ సరిహద్దుల్లో ప్రైవేటు వాహనాలపై దృష్టి పెట్టారు పలు లాడ్జిల్లో సైతం తనిఖీలను ముమ్మరం చేశారు ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు.