KCR: మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పై జరుగుతున్న విచారణకు హాజరుకానున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణలో కేసీఆర్ 18వ వ్యక్తిగా హాజరవుతుండటం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది.
ఈ రోజు ఉదయం 11:30 గంటలకు BRK భవన్ లో విచారణ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వస్తారు. కేసీఆర్ విచారణకు రావడాన్ని పురస్కరించుకుని, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు BRK భవన్‌కు రావాలని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు.
ఇంతవరకు 17 మంది అధికారులు, ప్రజాప్రతినిధులను విచారించిన కమిషన్, ఇప్పుడు ముఖ్యంగా కేసీఆర్‌ను ఇన్-కెమెరా విచారణ చేయనుంది. గతంలో నీటిపారుదల శాఖ(Irrigation Department)మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ లను కూడా ఇదే కమిషన్ విచారించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: Gold Rate Today: రెండో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు..తులం ఎంతంటే..?
ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజాప్రతినిధుల విచారణ ప్రారంభించిన ఘోష్ కమిషన్… కాళేశ్వరం నిర్మాణ సమయంలో జరిగిన ఆర్థిక, వ్యవస్థాపక లోపాలు, ఎక్యుట్‌మెంట్‌లు, మంజూరైన నిధుల వినియోగం తదితర అంశాలపై దృష్టిసారించింది.
ఈ విచారణలో కమిషన్ ప్రశ్నలు ఎలా ఉంటాయి? కేసీఆర్ వాటికి ఏవిధంగా సమాధానమిస్తారు? అనే విషయంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇంజినీర్లు, ఉన్నతాధికారులు విచారణకు హాజరయ్యారు.
కేశవేంద్ర సింగ్, వంకటేశ్ రావు లాంటి ఇరిగేషన్ ఉన్నతాధికారుల పైనా విచారణ సాగింది. ఇప్పుడు ప్రాజెక్టు రూపకల్పననుంచి నిధుల మంజూరివరకు కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం.