Tirumala:శ్రీవారి భక్తులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) మరో కీలక సమాచారాన్ని అందజేసింది. ఇప్పటి వరకూ ఆఫ్‌లైన్ ద్వారా రోజువారీ శ్రీవాణి దర్శనం టికెట్ల జారీని ఇక నుంచి ఆన్‌లైన్‌లో అందజేయనున్నది. రోజుకు ఆఫ్‌లైన్ 800 టికెట్లను అందజేస్తున్నది. ఇప్పటి నుంచి ఉదయం 9 గంటల నుంచే ఆన్‌లైన్‌లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు.
Tirumala:ఒక కుటుంబానికి మొత్తం నలుగురు మాత్రమే టికెట్ బుక్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్ ధ్రువీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి చేసినట్టు తెలిపారు. దీంతో భక్తులు టికెట్ల కోసం క్యూలైన్లలో నిరీక్షించే సమస్య లేకుండా పోతుంది.
Tirumala:అదే విధంగా ఆన్‌లైన్ విధానంలో రోజుకు 500 శ్రీవాణి దర్శన టికెట్ల జారీని టీటీడీ షురూ చేసింది. మూడు నెలల అనంతరం ఈ ఆన్‌లైన్ విధానంపై సమీక్ష జరిపి ఆ తర్వాత నిర్ణయం తీసుకోనున్నది. తిరుపతి విమానాశ్రయంలో నిత్యం భక్తులకు ఆఫ్‌లైన్ విధానంలో జారీచేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా యథావిధిగా కొనసాగుతుంది. అన్నివర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ వెల్లడించింది. దీనికి అనుగుణంగా అందరూ ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించింది.
