Thums Up: ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ గా ఎదగడమే కాదు పలు కమర్షియల్ యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గానూ చేస్తున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం దక్షిణాదిలో బ్రాండ్స్ విషయంలో మహేశ్ బాబుకి పోటీ ఇస్తున్నది బన్నీనే. ‘పుష్ప2’ మ్యానియా ఫుల్ గా ఉన్న ప్రస్తుత తరుణంలో బన్నీ నటించిన థమ్స్ అప్ బ్రాండ్ యాడ్ ను రిలీజ్ చేశారు. నిజానికి థమ్స్ అప్ కోసం ఇప్పటికే అటు నార్త్, ఇటు సౌత్ లో పలువురు స్టార్స్ ప్రకటనల్లో నటించారు. 1990 నుంచి ఇప్పటి వరకూ థమ్స్ అప్ ప్రకటనల్లో ఉత్తరాది నుంచి అక్షయ్, సల్మాన్, రణ్ వీర్ సింగ్, షారూఖ్, రణ్ వీర్ బ్రార్ తో పాటు క్రికెటర్ జస్పీత్ బుమ్రా, దక్షిణాది నుంచి జెడి. చక్రవర్తి, చిరంజీవి, మహేశ్ బాబు, విశాల్, విజయ్ దేవరకొండ, కిచ్చా సుదీప్ నటించారు.
Thums Up: ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. గతంలో శీతల పానీయాలు ఫ్రూటీ, 7 అప్ లో నటించిన బన్నీ థమ్స్ అప్ ప్రకటన ఇటీవల విడుదలైంది. ఈ యాడ్ ను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేశారు. అయితే పుష్ప2కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఇండియా లెవల్లో బన్నీ యాడ్ తోనే ప్రచారం మొదలు పెట్టింది థమ్స్ అప్. మరి బన్నీ స్టార్ డమ్ థమ్స్ అప్ సేల్స్ ను ఎంత వరకూ పెంచుతుందో చూడాలి.