Thug Life: కమల్ హాసన్ హీరోగా, త్రిష కథానాయికగా, దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘థగ్ లైఫ్’ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. శింబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలో ఘోర వైఫల్యం చవిచూసింది. కన్నడ వివాదం సినిమాని కుదిపేసింది. అయితే రిలీజ్‌కు ముందు, సినిమాను ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. కానీ, బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ చిత్రం దక్షిణ భాషల్లో నెల రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వస్తుందని ఊహాగానాలు వచ్చాయి. తాజాగా, ఈ సినిమా చుట్టూ మరో వివాదం తలెత్తింది. ఒప్పంద షరతులు మారినట్లుగా నెట్‌ఫ్లిక్స్ చిత్ర యూనిట్‌పై 25 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు సమాచారం. ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక స్పందన రాకపోవడం గమనార్హం. ఈ జరిమానా వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘థగ్ లైఫ్’ బాక్సాఫీస్ ఫలితాలతో పాటు ఇలా వరుస వివాదాలతో కమల్ కి మాయని మచ్చలా నిలిచింది.
