Akhanda 2

Akhanda 2: అఖండ 2 లో ఆది పినిశెట్టి కన్ఫర్మ్!

Akhanda 2: బాలకృష్ణ లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం “డాకు మహారాజ్” లేటెస్ట్ గానే ఓటిటిలో వచ్చి మళ్ళీ మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. ప్రస్తుతం బాలయ్య మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం “అఖండ 2 తాండవం” చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను ఈ సినిమాని మొదటి పార్ట్ కంటే మరింత గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో తారాగణం పరంగా కూడా చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్న బోయపాటి శ్రీను, ఆది పినిశెట్టిని కూడా కీలక పాత్ర కోసం తీసుకున్నట్టుగా ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో తాను ఉన్నట్టుగా ఆది లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేసాడు. ఈ చిత్రంలో ఆల్రెడీ తాను ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసానని నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా రివీల్ చేసాడు. దీంతో యువ నటుడు కూడా ఈ సినిమాలో కనిపించనున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్ ప్లస్ వారు నిర్మిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bollywood: అలియా భట్ నుండి నటాషా స్టాంకోవిచ్ వరకు పెళ్లికి ముందే గర్భవతి అయిన బాలీవుడ్ హీరోయిన్స్ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *