Nizamabad: తెలంగాణలోని ఏపీ ప్రజలు పండగకు ఊర్లకు వెళ్లిపోవడంతో.. ఇక్కడ దొంగలు రెచ్చిపోయారు. పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. దొరికినంతా దోచుకెళ్లారు.. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడ్డారు..
నిజామాబాద్ జిల్లాలో దొంగలు హల్‌చల్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడ్డారు. ఖలీల్‌వాడలోని మెడికల్ ఏజెన్సీ షట్టర్‌తో దొంగతనానికి పాల్పడ్డారు. స్థానికులు యజమానికి సమాచారం అందించడంతో మెడికల్ ఏజెన్సీకి వచ్చిన యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు షట్టర్ లేపుతున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారని స్థానికులు తెలిపారు. అటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దొంగలు రెచ్చిపోయారు. సంక్రాంతికి ఊరెళ్లిన వారి ఇండ్లను టార్గెట్ చేశారు. తాళాలు బద్దలు కొట్టి అందిన కాడికి డబ్బు నగలను దోచేశారు. ఇరు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో కేటుగాళ్లు తమ చేతివాటం కొనసాగించారు. విషయం తెలిసి లబోదిబోమన్న యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాగైన తమ డబ్బు, బంగారం వెతికి పెట్టాలని వేడుకుంటున్నారు.