Therachaapa: అనన్య క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కైలాష్ దుర్గం నిర్మిస్తోన్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, స్రీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను హీరో కార్తీక్ రత్నం, దర్శకుడు మ్యాగీ ఆవిష్కరించారు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి కీలక పాత్రలు పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రఫీ, ప్రజల క్రిష్, ఎం ఎల్ రాజా సంగీతం టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి.
టీజర్‌లో మాస్ ఎలిమెంట్స్, శక్తివంతమైన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నటుడు పృథ్వీరాజ్, హీరో నవీన్‌ను తమిళ స్టార్ విక్రమ్‌తో పోల్చి, అతని కఠోర శ్రమను కొనియాడారు. దర్శకుడు జోయల్ జార్జ్, తమిళ నేపథ్యంతో మాస్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందించినట్లు తెలిపారు. నిర్మాత కైలాష్ దుర్గం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టనుందని ధీమా వ్యక్తం చేశారు. హీరో నవీన్ రాజ్ తన కష్టాన్ని, సినిమాపై నమ్మకాన్ని పంచుకున్నారు. ‘తెరచాప’ త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది.
