Health Tips: చికెన్ బిర్యానీ తింటూనే కూల్ డ్రింక్స్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. బిర్యానీ తిని కూల్ డ్రింక్స్ తాగి ఆనందిస్తుంటారు.. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.
అవును నిజమే, కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిందే. కూల్ డ్రింక్ తాగుతూ బిర్యానీ తినడం ఇంకా మంచిది కాదంటున్నారు నిపుణులు. ఐతే కూల్ డ్రింక్స్ తాగడం.. బిర్యానీ తినడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బిర్యానీ తినేటప్పుడు కూల్ డ్రింక్స్ తాగితే పొట్టలో ఎసిడిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బిర్యానీ వంటి స్పైసీ ఫుడ్ తినడం వల్ల సాధారణంగా కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ విడుదలవుతుంది. అదనంగా, కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో ఆమ్లత్వం పెరుగుతుంది. దీని వల్ల గ్యాస్, గుండెల్లో మంట సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇది మొదట్లో బాగానే కనిపించినా దీర్ఘకాలంలో తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది.
ఇది కూడా చదవండి: Rice Price: తగ్గించిన బియ్యం రేటు.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.495 కోట్లు మిగిలాయి
Health Tips: జీర్ణ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ లో కార్బోనేషన్ జీర్ణక్రియపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది అజీర్ణం, కడుపు నొప్పి మరియు ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తుంది.
మధుమేహంతో బాధపడే వారికి ఇది మరింత ప్రమాదకరం. బిర్యానీ, కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు, కూల్ డ్రింక్స్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
కూల్ డ్రింక్స్ లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయం మరియు మూత్రపిండాలపై తీవ్ర ప్రభావాలను చూపుతాయి. బిర్యానీలో ఉండే ప్రొటీన్లు, కొవ్వులు శరీరానికి మరింత శక్తిని ఇస్తాయి. దీన్ని శీతల పానీయాలతో పాటు తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిక్ కంటెంట్ పెరుగుతుంది, ఇది కాలేయం మరియు మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది.