The RajaSaab

TheRajaSaab: రాజాసాబ్ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..

TheRajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘రాజాసాబ్’. దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సినిమాలో ముగ్గురు అందాల భామలు – నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ హైప్ నెలకొంది.

ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్.. ఇక సెకండ్ సాంగ్ హంగామా!

‘రాజాసాబ్’ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ జోరు పెంచింది. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్‌కు, అలాగే ఫస్ట్ లిరికల్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా, ఫస్ట్ సాంగ్‌లో వింటేజ్ ప్రభాస్ ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. డార్లింగ్ డాన్స్‌కు ఫుల్ ఖుషీ అయ్యి, సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పోస్ట్ చేశారు.

ఇది కూడా  చదవండి: Murder: పహాడీ షరీఫ్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య.. పాత కక్షలే కారణమా?

ఇప్పుడు, ఈ ఊపును కొనసాగిస్తూ చిత్ర యూనిట్ రెండో సింగిల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

చెన్నైలో గ్రాండ్ ఈవెంట్: ఆ రోజు సెకండ్ లిరికల్ సాంగ్!

‘రాజాసాబ్’ సెకండ్ లిరికల్ సాంగ్‌ను ఈ గురువారం, అంటే డిసెంబరు 18న విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్ లాంచ్‌ను మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు మేకర్స్ చెన్నైలో ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంగీత సంచలనం థమన్ ఈ సెకండ్ సాంగ్‌కు ఇచ్చిన మ్యూజిక్ ఒక రేంజ్‌లో ఉండబోతోందని సినీ వర్గాల సమాచారం. మొదటి సాంగ్‌లో డాన్స్‌తో మెప్పించిన ప్రభాస్, ఈ రెండో పాటలో క్యూట్ లుక్స్‌లో దర్శనమివ్వనున్నారట. ముఖ్యంగా, చెన్నైలో జరగబోయే ఈ ఈవెంట్‌కు హీరో ప్రభాస్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

‘రాజాసాబ్’ సినిమా అప్డేట్స్‌తో అభిమానులు సంక్రాంతి పండుగను ముందుగానే జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *