Rajasthan: రాబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని.. ఓటరు అవగాహనను పెంచడానికి ఎన్నికల సంఘం చేస్తున్న ప్రత్యేక చొరవ ట్రెండింగ్‌లో ఉంది. జార్ఖండ్ ఎన్నికల సంఘం చేస్తున్న కార్యక్రమం భారతదేశం అంతటా ట్రెండ్ అవుతోంది. ఈ ప్రచారం పేరు “మమ్మీ పాపా వోట్ డు”. ఈ ప్రచారం #MummyPapaVoteDo అనే హ్యాష్‌ట్యాగ్‌తో టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. ఈ ప్రచారంలో 17 లక్షల మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విషయంలో ఇందుకు చిన్నారులను ఎంత పొగిడినా తక్కువేనని జార్ఖండ్ ఎన్నికల ప్రధాన అధికారి అన్నారు.
Rajasthan: జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులను ఓటు వేయడానికి ప్రేరేపించడానికి పిల్లలు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమోషనల్ లెటర్స్ రాశారని అన్నారు. తమ తల్లిదండ్రులకు రాజ్యాంగ బాధ్యతను గుర్తు చేయడం ద్వారా పాఠశాల విద్యార్థులు భవిష్యత్తులో తమ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తారని నిరూపించారని చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడంపై రాష్ట్రంలోని ఓటర్లకు అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో ‘మమ్మీ పాపా ఓట్ డు’ ప్రచారాన్ని ప్రారంభించినట్లు రవికుమార్ తెలిపారు.