Potatoes

Potatoes: మీకు బంగాళాదుంపలు ఇష్టమా..? అయితే ఈ సమస్యలు పక్కా..

Potatoes: పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే కూరగాయలలో బంగాళాదుంప ఒకటి. సమోసాలు, బంగాళాదుంప ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడాలు, బంగాళాదుంప పరాఠాలు వంటి ఫాస్ట్ ఫుడ్‌తో సహా వివిధ రకాల వంటకాల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. కానీ బంగాళాదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రక్తంలో చక్కెర స్థాయిలు పెంపు: బంగాళాదుంపలను అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు బంగాళాదుంపలను మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

శ్వాసలో ఇబ్బందులు: బంగాళాదుంపలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల హైపర్‌కలేమియా కూడా వస్తుంది. ఇది శరీరంలో పొటాషియంను పెంచి..శ్వాస ఆడకపోవడం, విపరీతమైన శరీర నొప్పి, వాంతులు సహా ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఊబకాయం : బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల నడుము చుట్టూ, ఉదరం మధ్యలో కొవ్వు పెరుగుతుంది. కాబట్టి ఈ కూరగాయల వినియోగాన్ని పరిమితం చేసుకోవడం బెటర్ అని నిపుణులు అంటున్నారు.

Also Read: Sadist Husband: వీడు శాడిజానికి ఐకాన్.. భార్య నోటిలో జిగురు పోసి చిత్రహింసలు.. 

జీర్ణ సమస్యలు: మీ రోజువారీ ఆహారంలో ఎక్కువ బంగాళాదుంపలను చేర్చుకోవడం వల్ల మీ జీవక్రియపై ప్రభావం చూపుతుంది. మలబద్ధకం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు కనిపిస్తాయి.

అలెర్జీ సమస్య: మొలకెత్తిన బంగాళాదుంపలను ఉడికించి తింటే శరీరంలో అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. నీలం, మొలకెత్తిన బంగాళాదుంపలు కూడా విషపూరితమైనవి. వీటిని తినడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. ఈ బంగాళాదుంపలలోని స్టార్చ్ అలెర్జీలు వంటి సమస్యలకు దారితీస్తుంది.

రక్తపోటు సమస్యలు: బీపీ ఉన్నవారు బంగాళాదుంపలను ఎక్కువగా తినకపోవడమే మంచిది. బంగాళాదుంపలను అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్యలు మరింత పెరుగుతాయి. బీపీ పెరిగితే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

ఆర్థరైటిస్: ఆర్థరైటిస్ రోగులు బంగాళాదుంపలను పచ్చిగా తినకూడదు. అంతేకాకుండా దీనిని అధికంగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, మోకాలి నొప్పి, కీళ్ల నొప్పులు వస్తాయి. దీనిలోని కార్బోహైడ్రేట్ కంటెంట్ కీళ్ల నొప్పులను మరింత తీవ్రతరం చేస్తుంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *