Actor Sriram: తమిళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ అరెస్టుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రసాద్ విచారణలో నటుడు శ్రీరామ్‌కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు వెల్లడించడంతో పోలీసులు శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకుని కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నుంగంబాకం జైల్లో ఉన్న శ్రీరామ్ విచారణలో మరింత సమాచారం బయటపడింది. దీంతో నటుడు కృష్ణను విచారణకు పిలిచిన పోలీసులు, అతడు తొలి విచారణ తర్వాత పరారయ్యాడు. ప్రస్తుతం కృష్ణ కోసం ఐదు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. కృష్ణకు తమిళ సినీ రంగంలో యువ దర్శకులు, టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు, టాలీవుడ్ నటులతోనూ అతడికి సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా, సంబంధాల వివరాలను రాబడుతున్న పోలీసులు, ఈ కేసులో మరిన్ని పేర్లు బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. కోలీవుడ్‌లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
