Chhaava vs Court: బాలీవుడ్ స్టార్ విక్కీ కౌషల్, రష్మిక మందన్నా కాంబినేషన్‌లో లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ‘ఛావా’ చిత్రం, మరోవైపు తెలుగు యంగ్ హీరో ప్రియదర్శి హీరోగా నాని నిర్మాణంలో వచ్చిన ‘కోర్ట్’ సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలు తొలి వారంలో 2.2 మిలియన్ వ్యూస్ సాధించి సమాన రీచ్‌తో సంచలనం సృష్టించాయి.
Also Read: Shivarajkumar: పెద్ది సినిమా లో నా పాత్ర చాలా స్పెషల్
Chhaava vs Court: ‘ఛావా’ హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ కాగా, ‘కోర్ట్’ పాన్ ఇండియా భాషల్లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. వ్యూ హవర్స్‌లో ‘ఛావా’ 59 లక్షల గంటలతో అగ్రస్థానంలో నిలవగా, ‘కోర్ట్’ 55 లక్షల గంటలతో స్వల్ప గ్యాప్‌తో సత్తా చాటింది. హిందీలో ‘ఛావా’ రీచ్ అసాధారణమైనప్పటికీ, ‘కోర్ట్’ దాదాపు సమాన వ్యూ హవర్స్‌తో ఓటీటీలో సెన్సేషన్‌గా నిలిచింది. ఈ రెండు చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

