The Bengal Files: వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ది బెంగాల్ ఫైల్స్ చిత్రం అమెరికాలోని పది ప్రధాన నగరాల్లో గ్రాండ్ ప్రీమియర్స్తో సందడి చేయనుంది. ఈ చిత్రం భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో తెలియని సత్యాలను వెలికితీసే హార్డ్-హిట్టింగ్ డ్రామాగా రూపొందింది. జులై 19 నుంచి ఆగస్టు 10 వరకు న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, రాలీ, అట్లాంటా, టంపా, ఫీనిక్స్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, చికాగో, హ్యూస్టన్ నగరాల్లో ఈ ప్రీమియర్స్ జరగనున్నాయి. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఈ చిత్రం రాజకీయంగా సున్నితమైన, చరిత్రలో విస్మరించబడిన అంశాలను చర్చనీయాంశంగా మార్చనుంది. భారతదేశంలో సెప్టెంబరు 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చలను రేకెత్తించనుంది.
USA, I’m coming to you.
The Bengal Files is not just a film, but a buried truth every Indian must know.
It’s a film your children must watch before it’s too late.Come. Watch. Question.
See you at the premiere.🗓 10 Grand Premieres | 19 July – 10 August
🎟 Book your tickets… pic.twitter.com/2Aud0gPWqQ— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 7, 2025


