Minister Narayana: విజయవాడలోని వరద బాధితులకి నిలిచిన ప్రతీ ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో…ఆయన అధికారులతో సమీక్షించారు. వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిటీ అభివృద్ధి తదితర విషయాలపై అధికారులకి ఆయన దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎప్పటి పని అప్పుడే అయిపోవాలని…పెండింగ్ ఉండే ఊరుకోనని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో పలువురు మంత్రికి వినతి పత్రాలు అందచేశారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి న్యాయం చేయాలని స్పాట్‌లోనే అధికారుల్ని ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
Also Read: ఉప్పు లేనిదే ముద్ద దిగడంలేదా? అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే.. ఎందుకంటే..
బుడమేరు తెగిపోయి…సుమారు ఏడు లక్షల మంది 11 రోజులు నానా అవస్థలు పడిన విషయం తెలిసిందేనన్నారు. 11 రోజుకి 33 డివిజన్లకు గాను…29 డివిజన్ల క్లియర్ చేయడం జరిగిందన్నారు. అలాగే మరో నాలుగు డివిజన్లు క్లియర్ కావడానికి 19 రోజులు టైం పట్టిందన్నారు. ఆ 11 రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే స్వయంగా కలెక్టరేట్‌లో ఉండి…ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని, అధికారులందరిని ఫీల్డ్ కి పంపించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారన్నారు.
ఈ రోజు రాష్ట్రానికి దాదాపు రూ. 450 కోట్లకుపై ఫండ్స్ వచ్చాయని తెలిపారు. ఎందుకంటే ఆ పరిస్థితిని అందరూ కళ్లారా చూశారు కాబట్టే ముందుకు వచ్చారన్నారు. ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు కూడా స్వయంగా ఇళ్లలోకి తిరిగారన్నారు. అదే విధంగా నెల్లూరు నుంచి చాలా మంది వరద బాధితుల కోసం కూరగాయలు, దుప్పట్లు, ఫండ్స్ ఇలా అనేక రకాలుగా అండగా నిలిచారన్నారు. అలాగే మా నారాయణ ఆర్గనైజేషన్స్ నుంచి రూ. 2.5 కోట్లు మా పిల్లలు ఇవ్వడం జరిగిందన్నారు. నెల్లూరులో రాఘవయ్య రూ. 1 లక్ష ఇచ్చారని, అందుకు ముఖ్యమంత్రి నుంచి వరద బాధితుల కోసం అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారన్నారు. వరద బాధితులకి అండగా నిలిచిన ప్రతీ ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. దీని వల్ల ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన వారు అయ్యారన్నారు.
Also Read: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

