Thalli Manasu: రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘తల్లి మనసు’. దీనిని ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన కుమారుడు అనంత్ కిశోర్ నిర్మించారు. ఈ సినిమాతో ముత్యాల సుబ్బయ్య శిష్యుడు వి. శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల తొలి కాపీ సిద్థమైందని, సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేశామని, డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో సినిమాను విడుదల చేయబోతున్నామని అనంత కిశోర్ తెలిపారు. తల్లీ కొడుకుల అనుబంధాన్ని తెలియచేసే ఇంత మంచి చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదని సెన్సార్ సభ్యులు ప్రశంసించారని ఆయన అన్నారు. ఈ సినిమాను నైజాంలో ఏషియన్ ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయబోతున్నారని అన్నారు. ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు.