TGSRTC Employees: తెలంగాణాలో నేడు ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మె బాట పట్టారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సాయంత్రం 4 గంటలకు కార్మిక సంఘాల ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందజేయనున్నారు.
ఎలక్ట్రిక్ బస్సుల విధానాన్ని పునః సమీక్షించి, కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇంతకు ముందు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమయంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. అప్పటి ప్రభుత్వం వల్ల సమస్యలు నెరవేరుస్తాను అని చెప్పడంతో సమ్మె ను విరమించారు. కానీ అప్పటికే కార్మికుల్లో కొంత మంది ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనమైన విషయం తెలిసిందే.