Hyderabad: వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. భారీగానే వేతనాలు. ప్రపంచ గుర్తింపు ఉన్న కంపెనీలోనే పనిచేస్తున్నారు. అదీ బెంగళూరు నగరంలో. జీవితంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే స్థిరపడినట్టే అని మనం భావిస్తాం. కానీ వీరిద్దరూ చేసే ఘనకార్యం తెలుసుకుంటే మాత్రం మీరు చీదరించుకోక తప్పదు.
Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు వారానికి రెండు సెలవులు ఉంటాయి. ఆ సెలవు రోజుల్లో అందరూ కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ గడుపుతారు. కానీ వీరిద్దరు మాత్రం అదనపు ఆదాయాన్ని సంపాదించడమే లక్ష్యంగా చేసుకున్నారు. కష్టపడి పనిచేస్తే ఎవరూ కాదనరు. కానీ, వీరు చేసేది గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఉద్యోగులు అధికంగా ఉండే హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో అమ్ముతున్నారు. తాజాగా వారిలో ఒకతను పట్టుబడటం కలకలం రేపింది.
Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రశాంతిహిల్స్ టింబర్ లేక్ వ్యాలీ సమీపంలో కొందరు గంజాయిని విక్రయిస్తుండగా, ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. ఈ సందర్భంగా గంజాయిని విక్రయిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద 170 గ్రాముల విదేశీ గంజాయి, కిలో లోకల్ గంజాయి, బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: TGSRTC Employees: నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.. నేడు యాజమాన్యానికి నోటీసులు
Hyderabad: నిందితుడు బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజినీర్ శివరామ్‌గా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. మరో నిందితుడైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అజయ్ పరారీలో ఉన్నాడని, త్వరలో అతన్ని పట్టుకుంటామని తెలిపారు. ఈ ఇద్దరూ కలిసి ప్రతి వారాంతంలో గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు వెల్లడించారు.
Hyderabad: అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి గంజాయిని హైదరాబాద్‌కు అక్రమంగా తీసుకొచ్చి అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. లోకల్ గంజాయిని బెంగళూరులో కొనుగోలు చేసి ప్రైవేట్ బస్సుల్లో హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారని తెలిపారు. సినిమా వాళ్లకు కూడా విదేశీ గంజాయిని సరఫరా చేసినట్టు తెలుస్తున్నది. పరారీలో ఉన్న అజయ్‌ను అదుపులోకి తీసుకొని, నగరంలో ఎవరెవరికి సరఫరా చేస్తున్నారన్న విషయంపై కూపీ లాగనున్నట్టు తెలిపారు.