TG Inter Supply Results: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షలకు హాజరైన 4.13 లక్షల మంది విద్యార్థుల్లో 67.4 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
గత నెల మే 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ప్రధాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులతో పాటు, తమ మార్కులను పెంచుకోవాలనుకున్న ఇంప్రూవ్‌మెంట్ విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పుడు వారందరి ఫలితాలను విడుదల చేశారు.
TG Inter Supply Results: విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లైన tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లలో తమ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి చూసుకోవచ్చు.