Aamir Khan

Aamir Khan: ఆమీర్‌ ఖాన్‌ సినిమాకు దారుణాతి దారుణమైన రెస్పాన్స్‌!

Aamir Khan: టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. మొదటి రోజు వందల కోట్ల కలెక్షన్స్‌తో రికార్డులు బద్దలవుతున్నాయి. కానీ, బాలీవుడ్‌లో మాత్రం పరిస్థితి దయనీయం. సినిమాలు ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ సాధించలేక, లాంగ్‌ రన్‌లోనూ బోల్తా కొడుతున్నాయి. ఈ ఏడాది ‘ఛావా’, ‘హౌస్‌ఫుల్‌’ తప్ప మిగతా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బెడిసికొట్టాయి. ఇప్పుడు అందరి దృష్టి ఆమీర్‌ ఖాన్‌ కొత్త చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’పై పడింది. ‘తారే జమీన్‌ పర్‌’ సీక్వెల్‌గా ప్రచారం జరుగుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

ఆమీర్‌ ఖాన్‌ ఈ సినిమా కోసం గతంలో ఎన్నడూ లేనంతగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఇంటర్వ్యూలతో హోరెత్తిస్తున్నారు. పీఆర్‌ టీం కూడా బజ్‌ క్రియేట్‌ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా, సినిమాకు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ నీరసంగా ఉన్నాయి. రిలీజ్‌కు కేవలం కొద్ది గంటలు మాత్రమే సమయం ఉండగా, ప్రీ-బుకింగ్స్‌ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బాలీవుడ్‌లో ప్రస్తుతం ప్రీ-బుకింగ్స్‌ లేని సినిమాలు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. ‘సితారే జమీన్‌ పర్‌’ కూడా ఇదే గతి పడుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *