Tenali

Tenali: తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత.

Tenali: గుంటూరు జిల్లా తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి మేరీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు కాలనీలో ప్రభుత్వ స్థలం శుభ్రం చేసి పార్కును ఏర్పాటు చెయ్యాలని ఆలోచనలో మున్సిపల్ అధికారులు ఉన్నారు. మున్సిపల్ అధికారులు కాల్వలు శుభ్రం చేసే క్రమంలో నిన్న మురుగు కాల్వ పక్కన శుభ్రం చేసి వెళ్ళగా స్థానికులు మేరీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనుమతులు లేవని బొమ్మ తొలగించాలని స్థానికులను మున్సిపల్ అధికారులు ఆదేశించారు.

Tenali: బొమ్మ తొలగించటం కుదరదని మున్సిపల్ అధికారులకు స్థానికులు అడ్డం తిరిగారు. పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు బొమ్మను తొలగించారు. బొమ్మ తొలగించే క్రమంలో పోలీసులు, స్థానికుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. బొమ్మ తొలగించే క్రేన్‌పై స్థానికులు రాళ్లు విసరగా.. డ్రైవర్‌కు స్వల్పగాయం అయింది. ఘర్షణకు కారణమైన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Chamala Kiran Kumar: జైల్లో ఉంటే ఒక మాట..బయటకి వస్తే ఒక మాట

Tenali: మేరీ మాత విగ్రహం తొలగిస్తే పక్కనే ఉన్న నిత్యం పూజలు అందుకునే అంకమ్మ తల్లి విగ్రహాన్ని కూడా తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. స్థానికుల డిమాండ్‌ మేరకు చెట్టు కింద ఉన్న దిమ్మను కూడా మున్సిపల్ అధికారులు తొలగించారు. తెనాలిలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీ చార్జీలో పలువురికి గాయాలయ్యాయి. త్రీ టౌన్ సీఐ డౌన్‌డౌన్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Naga Chaitanya-Sobhita: వైజాగ్లో నాగచైతన్య-శోభితా పెళ్లి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *