Telugu news:రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య గాలులు ప్రభావం చూపుతున్నాయి. తీవ్ర చలిప్రభావం పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే గత రెండు రోజులుగా ఈ తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాత్రి మరింతగా చలిగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరింతగా పెరిగింది. ఈశాన్యం వైపు నుంచి వచ్చిన గాలులతో గాలిలో తేమ శాతం పెరుగుతున్నది.
Telugu news:తెలంగాణలో చలి తీవ్రత పెరగడంతో ఆదిలాబాద్‌లో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్‌చెరులో 10.2, రాజేంద్రనగర్‌లో 12.5, రామగుండంలో 12.7, హనుమకొండలో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ నగరంలో సగుటున 15.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోవడంతో రాత్రి, ఉదయం వేళల్లో చలి వణుకు పుట్టిస్తున్నది.
Telugu news:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. దట్టంగా పొగమంచు అలుముకొని చలి ప్రభావం వ్యాపించింది. చింతపల్లిలో 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్ర నమోదవగా, మినుములూరులో 8, అరకు, పాడేరులో 10 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. మాడగడ, వంజంగి, మేఠాల కొండలకు పర్యాటకుల తాకిడి పెరిగింది.