Netflix

Netflix: గేర్ మార్చి స్పీడ్ పెంచిన నెట్ ఫ్లిక్స్!?

Netflix: ఓటీటీ వరల్డ్ లో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మధ్య భారీ పోటీ నెలకొని ఉంది. నెట్ ఫ్లిక్స్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపుతో అంతర్జాతీయ కంటెంట్ ప్రాధాన్యత ఇస్తూ ఇటీవల కాలం వరకూ ప్రాంతీయ సినిమాలపై అంతగా దృష్టి సారించలేదు. దానికి తోడు నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ కూడా ఎక్కవ రేటు ఉండటంతో ఇండియాలో వీక్షకులు అంతగా ఆసక్తి చూపించలేదు. దాంతో ప్రైమ్, హాట్ స్టార్ అధిపత్యం చెలాయించేశాయి. ప్రాంతీయ మార్కెట్ పెంచుకోవలసిన ఆవశ్యకతను గుర్తించిన నెట్ ఫ్లిక్స్ గేరు మార్చి స్పీడ్ పెంచింది. 2023 నుంచి ప్లాన్ అమలు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు బజ్ ఉన్న సినిమాల రైట్స్ తీసుకుని మార్కెట్ ను విస్తరించుకుంది. ‘దేవర, లక్కీభాస్కర్, అమరన్’ వంటి చిత్రాలతో పాటు లేటెస్ట్ హిట్ ‘పుష్ప2’ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను పొందింది.

Netflix: నాలుగు వారాల వ్యవధితో ‘పుష్ప2’ నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షం కానుంది. నాని ‘సరిపోదా శనివారం, గుంటూరు కారం, టిల్లు స్వేర్, మత్తువదలరా’ చిత్రాలతో పాటు ప్లాప్ అయిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మిస్టర్ బచ్చన్’ చిత్రాలు కూడా స్ట్రీమ్ చేసింది. తమిళంలోనూ ఇదే పంధాను అనుసరిస్తోంది. అంతే కాదు సీరీస్, వెబ్ చిత్రాల నిర్మాణం కూడా చేస్తోంది. గేర్ మార్చి స్పీడ్ పెంచిన నెట్ ప్లిక్స్ చందా విషయంలోనూ రాజీపడితే ఇక తిరుగే ఉండదు. చూడాలి మరి నెట్ ప్లిక్స్ టీమ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *