Telangana:

Telangana: స‌హ‌కార సంఘాల‌ ఎన్నిక‌లు ర‌ద్దు?

Telangana: రాష్ట్ర‌వ్యాప్తంగా స‌హ‌కార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేసే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. క‌ర్ణాట‌క త‌ర‌హాలో నామినేటెడ్ ప‌ద్ధ‌తిలో పీఏసీఎస్‌ల‌కు పాల‌క‌వ‌ర్గాల‌ను నియ‌మించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. అదే జ‌రిగితే నూరుశాతం స‌హ‌కార సంఘాల చైర్మ‌న్లు, డీసీసీబీ చైర్మ‌న్లు, స‌భ్యులు, డైరెక్ట‌ర్ ప‌ద‌వులు అన్నీ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తోనే భ‌ర్తీ చేసుకునే వెసులుబాటు అధికార పార్టీకి ఉంటుంది.

Telangana: స‌హ‌కార సంఘాలకు నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీతో ఎన్నిక‌ల ఖ‌ర్చు ప్ర‌భుత్వానికి మిగులుతుంద‌ని భావిస్తున్నారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు పెద్ద ఎత్తున ప‌ద‌వులు ద‌క్కుతాయి. ఇదే అంశంపై త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లో చ‌ర్చించి, రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని స‌మాచారం.

Telangana: ఇదిలా ఉండ‌గా, ఇప్ప‌టికే పీఏసీఎస్‌, డీసీసీబీ పాల‌క‌వ‌ర్గాల‌ను ర‌ద్దు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే ఆదేశాల‌ను జారీచేసింది. ఐదేళ్ల కాల‌పర‌మితి మిగిసిపోగా, గ‌త ఫిబ్ర‌వ‌రిలో ఆరు నెల‌ల‌పాటు ప‌ద‌వీ కాలాన్ని ప్ర‌భుత్వం పొడిగించింది. అది కూడా పూర్త‌వ‌గా, ఇటీవ‌లే ప్ర‌భుత్వం ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. ఈ ద‌శ‌లో ప్ర‌భుత్వం అకున్న‌ట్టుగా జ‌రిగితే వ‌చ్చే రెండు నెల‌ల్లోనే పాల‌క‌వ‌ర్గాల‌ను నామినేటెడ్ ప‌ద‌వులుతో భ‌ర్తీ అవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *