Telangana Talli Statue:రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని డిసెంబర్ 9న ఆ విగ్రహాలను ఆవిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో విగ్రహానికి రూ.17.5 లక్షలతో రూపొందించే పనిలో ఉన్నారు.
Telangana Talli Statue:రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలకు కలిపి రూ.5.77 కోట్లతో ఆయా విగ్రహాల ఏర్పాటు పనులు ప్రతిష్ఠాత్మకంగా కొనసాగుతున్నాయి. ఈ విగ్రహం 12 అడుగల ఎత్తులో ఉండేలా రూపొందిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని జిల్లాల కలెక్టరేట్లకు ఆదేశాలు వెళ్లాయి.

