Telangana Secretariat: హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదుట మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రైతులు మెరుపు ధర్నాకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైతులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. తమకు చెందిన భూముల పాస్ పుస్తకాల్లో అడవి పేరిట నమోదయ్యాయని రైతులు ఈ ఆందోళనకు దిగారు. పట్టాలు మార్చాలని కోరుతూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
Telangana Secretariat: మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలివచ్చారు. అందరూ ఒక్కసారిగా ఆందోళనకు దిగి నినాదాలు చేయసాగారు. వెంటనే పోలీసులు అకస్మాత్తుగా వచ్చి రైతుల నోళ్లు మూయించి వాహనాల్లో తరలించారు. రైతులు రోడ్డుపై పెద్ద ఎత్తున చేరుకొని నిరసనకు దిగడంతో వాహనదారులు అవాక్కయ్యారు.
Telangana Secretariat: తమ పాస్ పుస్తకాలు అడవి పేరున నమోదయ్యాయని రైతులు ఈ సందర్భంగా తెలిపారు. వెంటనే పేరు మార్చి నిజమైన రైతుల పేరిట పట్టాలు ఇవ్వాలని వారు కోరారు. గత బీఆర్ఎస్ హయాంలో 700 ఎకరాలకు పట్టాలు ఇచ్చారని, ఇంకా 1,100 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే సచివాలయం ఎదుట నిరసన తెలిపేందుకు తరలివచ్చామని తెలిపారు.