Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్‌లో అసలేం జరుగుతోంది? వరుస నకిలీ ఉద్యోగులు బయటపడుతున్నా, బుధవారం ఏకంగా నకిలీ ఐఏఎస్‌ను గుర్తించడంతో కలకలం రేపుతోంది. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా నకిలీ ఉద్యోగులు ఎలా జొరబడుతున్నారు? వరుసగా ఎందుకు బయటపడుతున్నారు? అసలు ఇంకా ఇలాంటి నకిలీలు ఎంత మంది ఉన్నారు? ఎవరు దీనికి ఊతం ఇస్తున్నారు? ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర సెక్రటేరియట్‌లో ఒక్క నకిలీ ఉద్యోగి దొరికితేనే మరొకరు దొరకకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సింది పోయి వరుసగా వచ్చేలా ఎవరు ఊతం ఇస్తున్నారు. దీనికి అంతం లేదా? అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.
Telangana Secretariat:సెక్రటేరియట్‌లో వరుస నకిలీలు బయటపడుతుండగా, బుధవారం ఏకంగా నకిలీ ఐఏఎస్ పేరిట ఉన్న ఐడీతో ఒక వ్యక్తి దొరికిపోయాడు. బాలకృష్ణ ఐఏఎస్ పేరిట ఉన్న ఐడీ కార్డుతో తరచూ సచివాలయంలోకి రాకపోకలు సాగిస్తున్న వ్యక్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ లోగా తనిఖీ చేయగా, అసలు బాగోతం బయటపడింది.
Telangana Secretariat:ఈ నేపథ్యంలో ఎస్పీఎఫ్ పోలీసులను సెక్రటేరియట్ సీఎస్వో దేవీదాస్ అలర్ట్ చేశారు. మరిన్ని తనిఖీలు చేపట్టగా, మరో ఇద్దరు అటెండర్లు నకిలీలుగా గుర్తించారు. ఈ నకిలీల వ్యవహారంపై సెక్రటేరియట్ ఉద్యోగుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పట్టుబడిన నకిలీ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
Telangana Secretariat:నెలరోజుల వ్యవధిలో సెక్రటేరియట్ ప్రాంగణంలో నకిలీ ఉద్యోగులు దొరకడం కలకలం రేపుతున్నది. గతంలో రెవెన్యూ ఉద్యోగిగా ఒక దొరికిపోగా, తహసీల్దార్‌గా మరొకరు చెలామణి అవుతూ దొరికిపోయారు. కొంపెల్లి అంజయ్య అనే వ్యక్తి ఎమ్మార్వో స్టిక్కర్ ఉన్న వాహనంతో సెక్రటేరియట్‌కు పలుమార్లు వచ్చినట్టు ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. రెవెన్యూ ఉద్యోగిగా నకిలీ ఐడీతో చెలామణి అవుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్‌రావును గుర్తించి అరెస్టు చేశారు. ఆయనకు సహకరించిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.