OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమా సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు సిద్ధమైంది. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో రేట్లు పెరగనున్నాయి. స్పెషల్ ప్రీమియర్ షో కూడా ప్లాన్‌లో ఉంది. అభిమానులు ఈ రిలీజ్ కోసం ఉత్సాహంగా ఉన్నారు. పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Lakshmi Manchu: ఇదేం దిక్కుమాలిన ప్రశ్న.. ఫిల్మ్ జర్నలిస్టుపై నటి మంచు లక్ష్మి ఫిర్యాదు..
‘ఓజి’ చిత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు యాక్షన్ థ్రిల్లర్ ట్రీట్ ఇవ్వనుంది. ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించగా, డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తోంది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లకు రూ.100, మల్టీప్లెక్స్‌లకు రూ.150 టికెట్ రేట్ పెంపు అనుమతించారు. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు రూ.800 రేట్‌తో స్పెషల్ ప్రీమియర్ షో ఉంటుంది. ఏపీలో ఇప్పటికే రేట్ల పెంపునకు జీవో జారీ కాగా, నైజాంలో కూడా క్లారిటీ వచ్చింది.