Telangana: తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లను బాగా ఆకర్షించింది. మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే పథకమే. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ హామీని ఇచ్చింది. ఆరు గ్యారెంటీలు, ఇతర ఎన్నో హామీలు ఇచ్చినా, మహిళా లోకం మాత్రం నెలకు రూ.2,500 వస్తాయనే ఆశతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఆ పార్టీ గెలిపించారు. 20 నెలల పాటు ఆ పథకం ఊసే ఎత్తని సర్కారు.. త్వరలో ఆ పథకాన్ని అమలు చేయనున్నదా? అంటే అమలు చేయొచ్చు.. అన్న మాటలు వినిపిస్తున్నాయి. నగదు సాయం
Telangana: ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈ పథకాన్ని పట్టించుకోనేలేదు. ఇంతవరకు అమలు ఊసే ఎత్తడం లేదు. మహిళలు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికీ ఆ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశతో ఉన్నారు. అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది. 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలైతే స్థానిక ఎన్నికలు జరుగుతాయి.
Telangana: ఈ నేపథ్యంలో ఈ స్థానిక ఎన్నికలకు ముందే మహిళలకు రూ.2,500 ఇచ్చే పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ వర్గాలు కూడా నిజమేనని అంగీకరిస్తున్నాయి. కాంగ్రెస్ గెలిచి ఇప్పటికి 22 నెలలు కావస్తున్నా.. ఇప్పటి వరకూ ప్రభుత్వంపై సరైన సానుకూలత ఏర్పడలేదని, స్థానిక ఎన్నికల్లో గెలుపు కష్టమేనని, ఏదో ఒకటి మ్యాజిక్ చేయాలని కాంగ్రెస్ కింది స్థాయి నేతలు సీఎంకు, ఇతర మంత్రులకు ఒత్తిడి తేసాగారు.
Telangana: అదే విధంగా హైడ్రా, ఎరువుల కొరత, ఉద్యోగాల నియామకాలపై కాంగ్రెస్ పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ దశలో మహిళలకు ఆర్థికసాయం అందజేసే పథకాన్ని అమలు చేస్తే సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు నెలకు రూ.2,500 చొప్పున ఏడాదికి రూ.30,000ను అర్హులైన మహిళల ఖాతాల్లో జమ చేయనున్నది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 55 ఏళ్ల లోపు వయసు ఉండి, తెల్లరేషన్ కార్డు కలిగిన మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు.