Telangana:

Telangana: టీహ‌బ్‌లోకి ప్ర‌భుత్వ కార్యాల‌యాలొద్దు.. అమెరికా నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

Telangana: హైద‌రాబాద్ న‌గ‌రంలోని టీహ‌బ్ కార్యాల‌యంలో ప్ర‌భుత్వ కార్యాల‌యాల ఏర్పాటుపై సీఎం రేవంత్‌రెడ్డి అభ్యంత‌రాల‌ను వ్య‌క్తంచేశారు. అమెరికా నుంచి తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌రావుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వెంట‌నే ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు అప్ప‌గిస్తూ ఇచ్చిన జీవోను వెన‌క్కి తీసుకోవాల‌ని చెప్పారు.

Telangana: ఐటీ అంకురాల‌కు కేంద్రంగా ఉన్న టీ హ‌బ్‌లోని 65 వేల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు ఇవ్వాల‌ని ఇటీవ‌లే రాష్ట్ర ప్రభుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. ఈ స్థ‌లంలో బేగంపేట‌లోని క‌మర్షియ‌ల్ ట్యాక్స్ కార్యాల‌యంతోపాటు వ‌ట్టి నాగుల‌ప‌ల్లిలోని శేరిలింగంప‌ల్లి స‌బ్ రిజిస్ట్రార్, నార్సింగిలో ఉన్న గండిపేట, కూక‌ట్‌ప‌ల్లిలోని ప్ర‌శాంత‌న‌గ‌ర్‌, మూసాపేట‌లో ఉన్న రంగారెడ్డి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల కోసం కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

Telangana: టీహ‌బ్ స్థ‌లాన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు అప్ప‌గిస్తూ తీసుకున్న‌ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో మీడియాలో, యువ‌త, టీహ‌బ్ సిబ్బంది నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. దీంతో రేవంత్‌రెడ్డి స‌ర్కార్ వెన‌క్కి త‌గ్గింది. టీహ‌బ్ విష‌యంలో పున‌రాలోచించింది. టీహ‌బ్‌ను స్టార్ట‌ప్ కేంద్రంగానే కొన‌సాగించాల‌ని అమెరికా నుంచి సీఎం ర‌వేంత్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అద్దె భ‌వ‌నాల్లో ఉన్న ప్ర‌భుత్వ ఆఫీసుల‌ను ఇత‌ర ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌కు త‌ర‌లించాల‌ని సూచించారు. దీంతో ఇచ్చిన జీవోను ఉప‌సంహరించుకోనున్న‌ట్టు తెలుస్తున్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *