Telangana Assembly Sessions: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉ.10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సమావేశాలలో పలు కీలక బిల్లులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో సీఎం ప్రకటించనున్నారు. సభ ముగిసిన తర్వాత సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు .
ఈరోజు పలు కీలక బిల్లులపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తెలపనున్నారు . అదేవిధంగా ROR చట్టం 2020 రద్దు, కొత్త భూమాత పోర్టల్‌పై చర్చించనున్న అసెంబ్లీ. ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వ విధానంపై సభలో ప్రకటించే అవకాశం. ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వ విధానంపై సభలో ప్రకటించనున్నారు. విద్యుత్ కమిషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు చర్చిస్తారు.