Teja Sajja

Teja Sajja: తేజ సజ్జ నుంచి మరో దేవుడి కథ..?

Teja Sajja: హను మాన్, మిరాయ్ తర్వాత మరోసారి అలాంటి చిత్రంతోనే తేజ సజ్జ రెడీ అవుతున్నాడు. ‘అద్భుతం’ డైరెక్టర్ మల్లిక్ రామ్‌తో కలిసి పురాతన కాస్మిక్ గాడ్ కథను ఈ తరం ప్రేక్షకులకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ‘హను మాన్’ సెన్సేషనల్ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జ ఇటీవల ‘మిరాయ్’ తో కూడా మంచి హిట్ కొట్టాడు. మళ్లీ అలాంటి జోనర్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Also Read: Movie Piracy: ఐబొమ్మ ని ఆపితే పైరసీ ఆగదు.. సినిమా రిలీజ్ అయిన వెంటనే సైట్ లోకి

‘అద్భుతం’ సినిమాతో పరిచయమైన డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. పురాణాల్లో ఉన్న ఒక పురాతన కాస్మిక్ గాడ్‌ను నేటి యువతకు అర్థమయ్యే విధంగా, ఆకట్టుకునేలా ఆధునికీకరించి తెరకెక్కిస్తున్నారు. హను మాన్‌లో అంజనేయ స్వామి శక్తిని అద్భుతంగా చూపించిన తేజ సజ్జ ఈసారి మరో శక్తివంతమైన దేవుడి పాత్రలో కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైనే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయి ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందట. ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *