Tax for pets

Tax for Pets: ఇంట్లో పెట్స్ ఉంటే టాక్స్ కట్టాల్సిందే.. నివ్వెరపరుస్తున్న మున్సిపాలిటీ నిర్ణయం.. ఎక్కడంటే..

Tax for Pets: ఇళ్లలో జంతువులను పెంచుకోవడం చాలామంది చేస్తుంటారు. ఇంట్లో పెంచుకునే జంతువులను తమ పిల్లలతో సమానంగా చూసుకునేవారు ఎందరో ఉన్నారు. ఆవులు, మేకలు వంటి జంతువులను కూడా ఇంటి దగ్గర స్థలం ఉంటే పెంచుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇక కుక్కలను, పిల్లలును పెంచుకోవడం సరదాగా చాలామందికి ఒక హాబీగా ఉంటుంది. అలా ఇకపై ఎవరైనా జంతువులను సరదా కోసమో.. ఆనందం కోసమో.. ప్రేమతోనో పెంచుకుంటే టాక్స్ కట్టాల్సిందే అంటున్నారు. ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే. తమిళనాడు మధురైలో మున్సిపాలిటీ తాజాగా ఇంటిలో జంతువులను పెంచుకునే వారిపై టాక్స్ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మధురై మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. మధురై కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిన్న అంటే ఫిబ్రవరి 26, 2025న మేయర్ ఇంద్రాణి పొన్. వసంత్ అధ్యక్షతన జరిగింది. అన్నాడీఎంకే మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సెల్లూర్ రాజు, దక్షిణ నియోజకవర్గ ఎండీఎంకే ఎమ్మెల్యే భూమినాథన్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ఈలోగా, కొన్ని తీర్మానాలు ఆమోదించారు. వాటిలో ముఖ్యంగా పక్షులు, జంతువులను ఇళ్లలో పెంచుకుంటే రుసుము విధించాలనే నిర్ణయం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అంటే ఇళ్లలో పక్షులు, పెంపుడు జంతువులను ఉంచుకోవాలంటే మున్సిపాలిటీకి డబ్బు కట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏ జంతువుకు ఎంత కట్టాలి అనే ఫీజుల వివరాలను కూడా ఆమోదించారు.

Also Read: Pakistan Coach: భారత్ తో పాక్ అందుకే ఓడిపోయింది..! పాకిస్తాన్ కోచ్ కీలక వ్యాఖ్యలు

పెంపుడు జంతువుల రుసుము వివరాలు
మధురై కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఈ క్రింది రుసుములను ప్రకటించింది: – ఇళ్లలో ఆవులను పెంచడానికి రూ. 500 రుసుము, గుర్రాలను పెంచడానికి రూ. 750 రుసుము, మేకలను పెంచడానికి రూ. 150 రుసుము అదేవిధంగా పందులను పెంచడానికి రూ. 500 రుసుము వసూలు చేస్తారు. అంతేకాకుండా కుక్కలు – పిల్లులను పెంచడానికి రూ.750 ఫీజు ఫిక్స్ చేశారు. ధర నిర్ణయాల్లో వివిధ రకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ తీర్మానం మాత్రమే ఆమోదించారు. ఈ నిర్ణయాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయో కార్పొరేషన్ త్వరలో ప్రకటిస్తుందని భావిస్తున్నారు. అలాగే, ఈ రుసుములు సంవత్సరానికా.. నెలకా అనే విషయం కూడా ఇంకా స్పష్టం కాలేదు. కానీ, ఈలోపు ఈ విషయం వైరల్ అయింది. విపక్షాలన్నీ మున్సిపల్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *