Tamilnadu: తమ అనారోగ్యాన్ని నయం చేసుకునేందుకు దవాఖానకు వెళ్లి చికిత్స పొందుతున్న కొందరు రోగులకు నిన్న రాత్రి కాళరాత్రి అయింది. అదే రోజు ఆఖరి రోజయింది. బెడ్లపై గాఢనిద్రలో ఉన్నప్పుడే అగ్నికి ఆహుతై ప్రాణాలొదిలారు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో ఏడుగురు రోగులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఇంకా పలువురు తీవ్ర గాయాలపాలయ్యరు.
Tamilnadu: తమిళనాడు రాష్ట్రంలోని దిండిగుల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఏడుగురు రోగులు అగ్నికి ఆహుతయ్యారు. లోపల చిక్కుకున్న పలువురు రోగులను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. పలువురికి మంటలంటుకొని గాయాలయ్యాయి.