Tamil Movies: అజిత్ నటించిన చిత్రాలే కాదు.. స్టార్ హీరోల సినిమాలేవీ ఈసారి పొంగల్ బరిలో దిగకపోవడంతో విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాలను ఇప్పుడు దుమ్ముదులిపి, జనంలోకి వదలడానికి తమిళ నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా చిత్రాలు, పాత చిత్రాలు కలిసి పదికి పైగానే పొంగల్ బరిలో నిలువబోతున్నాయి. శంకర్ డైరెక్ట్ చేసిన రామ్ చరణ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’, బాల దర్శకత్వంలో అరుణ్ విజయ్ నటించిన ‘వనన్ గాన్’, నిహారిక కొణిదెల నటించిన ‘మద్రాస్ కారన్’ జనవరి 10న విడుదల కాబోతున్నాయి. విశాల్, సంతానం హీరోలుగా సి. సుందర్ తెరకెక్కించిన ‘మదగజరాజా’ ఈ నెల 12న రాబోతోంది.
ఇది కూడా చదవండి: Kumbh Mela 2025: సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం.. ఇంట్లో కూర్చునే మహా కుంభ్ మేళా చూడండి..
Tamil Movies: అలానే సత్యరాజ్ తనయుడు శిబి నటించిన ‘టెన్ అవర్స్’, షణ్ముఖ పాండియన్ నటించిన అటవీ నేపథ్య చిత్రం ‘పడై తలైవాన్’, కేశన్ దాస్ నటించిన ముక్కోణ ప్రేమకథా చిత్రం ‘తరుణం’, ప్రియా ఆనంద్ నటించిన ‘సుమో’ చిత్రాలు పొంగల్ బరిలో నిలువబోతున్నాయి. ఈ నెల 14న విష్ణువర్థన్ దర్శకత్వం వహించిన ‘నెసిప్పయ’, ‘జయం’ రవి, నిత్యామీనన్ ‘కాదలిక్క నేరమిల్లే’ విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలన్నీ అనుకున్నట్టు రిలీజ్ అయితే రెండు విశేషాలు ఉంటాయి. అంజలి నటించిన రెండు సినిమాలు ఈ పొంగల్ కు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నట్టు. అలానే అన్న రామ్ చరణ్ మూవీతో చెల్లి నిహానిక కొణిదెల మూవీ పోటీ పడుతున్నట్టు!