Tollywood: గత కొంతకాలంగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న అగ్ర కథానాయిక పూజా హెగ్డే తన పారితోషికం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్‌లో బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ‘అలా వైకుంఠపురంలో’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసిన ఈ బుట్టబొమ్మ, ఇప్పుడు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తగ్గించుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
‘అలా వైకుంఠపురంలో’ మ్యాజిక్ తర్వాత పెరిగిన పారితోషికం
కెరీర్‌లో అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ‘అలా వైకుంఠపురంలో’ తర్వాత పూజా హెగ్డే పారితోషికం భారీగా పెరిగిందని టాక్ ఉంది. అప్పట్లో ఒక్కో సినిమాకు కోటిన్నర నుంచి మూడు కోట్ల వరకు డిమాండ్ చేసిందట. ఈ అధిక పారితోషికమే ఆమెను తెలుగు ఫిల్మ్ మేకర్స్‌కు కొంత దూరంగా ఉంచిందనే చర్చ కూడా నడిచింది. ఆమె నటించిన చివరి చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడం, సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగడం ఆమె నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
దుల్కర్ సినిమా కోసం ‘జస్ట్’ 3 కోట్లు!
తాజా సమాచారం ప్రకారం, పూజా హెగ్డే ప్రస్తుతం నటిస్తున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ 41వ సినిమా (దుల్కర్ 41) కోసం తన పారితోషికాన్ని తగ్గించుకుంది. ఈ సినిమాకు ఆమె దాదాపు రూ. 3 కోట్లు ఛార్జ్ చేసినట్లు లేటెస్ట్ బజ్.
ఇది కూడా చదవండి: Japan Film Team Meeting: జపాన్ CODAతో TFCC కీలక ఒప్పందం.. చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వ అండ!
పాత పారితోషికాలతో పోలిస్తే తేడా స్పష్టం:
గతంలో ఆమె అందుకున్న భారీ పారితోషికాలతో పోలిస్తే ఈ మొత్తం చర్చనీయాంశమైంది. ఈ సినిమా కోసం పూజా ఏకంగా రూ. 4 కోట్లు తీసుకుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ భారీ చిత్రం కోసం ఆమె రూ. 6 కోట్ల వరకు పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం. కేవలం ఒక ఐటమ్ సాంగ్ కోసం కూడా ఆమె రూ. 3 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కేవలం ఐటమ్ సాంగ్ కోసం తీసుకున్నంత మొత్తాన్ని, ఇప్పుడు దుల్కర్ సినిమా కోసం మెయిన్ హీరోయిన్‌గా తీసుకోవడం అనేది పారితోషికం తగ్గించుకున్నట్లుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
విశ్లేషకుల అభిప్రాయం: తగ్గించినా ఎక్కువే?
ఒకవైపు ఆమె పారితోషికం తగ్గించుకున్న విషయం చర్చకు దారి తీయగా, మరోవైపు సినీ విశ్లేషకులు మాత్రం ఈ రూ. 3 కోట్లు కూడా ఆమెకు ఎక్కువే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘అలా వైకుంఠపురంలో’ తర్వాత మ్యాజిక్‌ను పునరావృతం చేయడంలో ఆమె తడబడుతోంది. బ్లాక్‌బస్టర్ సౌండ్ విని ఏళ్లు దాటిపోతున్నా, ఇంకా ఆ స్థాయిలో పారితోషికం తీసుకోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే, బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ, పూజా హెగ్డేకు అవకాశాలకు కొదవేమీ లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. సక్సెస్ ఉన్నప్పుడే పారితోషికాలు డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుందని గ్రహించిన పూజా హెగ్డే, కెరీర్‌ను నిలబెట్టుకోవడానికి, మంచి ప్రాజెక్ట్‌లు చేజార్చుకోకుండా ఉండటానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది.
